విజయనగరం: అనుమతులు ఉన్నవారు మాత్రమే పశు మాంసం విక్రయించాలి

65చూసినవారు
విజయనగరం: అనుమతులు ఉన్నవారు మాత్రమే పశు మాంసం విక్రయించాలి
అన్ని రకాల అనుమతులు ఉన్నవారు మాత్రమే పశు మాంసాన్ని విక్రయించాలని విజయనగరం వన్ టౌన్ సిఐ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఆయన పట్టణంలోని కంటోన్మెంట్, కలెక్టర్ ఆఫీస్ ఏరియాలో పశు మాంసం విక్రయిస్తున్న వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. అనుమతులు లేకుండా పశువులను వధించడం, రవాణా చేయడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే బాధ్యులపై ఏపీ ప్రివెన్షన్ కౌ స్లాటరింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్