నగర పరిశుభ్రతకు ప్రజా సహకారం కూడా అవసరమని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. గురువారం క్షేత్రస్థాయి పర్యటన భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన పలు అంశాలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేసారు. పెద్ద చెరువు అవుట్ ఫ్లో నీటి ప్రవాహం వద్ద చెత్తాచెదారాలు నిండి ఉండడాన్ని గమనించారు. తక్షణమే వాటిని తొలగించి నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలని తెలిపారు.