విజయనగరం: పరిశ్రమలకు త్వరగా అనుమతులు

53చూసినవారు
విజయనగరం: పరిశ్రమలకు త్వరగా అనుమతులు
పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణాన్ని నెలకొల్పేందుకు సింగిల్‌ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తున్నామని కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చెప్పారు. జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 6 నెలల్లో సింగిల్‌ విండో విధానంలో 221 పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తులు రాగా 195 మందికి పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్