మహిళల విద్యను ప్రోత్సహించి అందుకోసం చారిత్రక పోరాటం నడిపిన ధీశాలి సావిత్రిబాయి ఫూలే అని జనసేన నేత గురాన అయ్యలు కొనియాడారు. సావిత్రి బాయి ఫూలే జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం విజయనగరంలోని స్థానిక కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ వద్ద మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రి బాయి ఫూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు ఎంతో కృషి చేశారని కొనియాడారు.