విజయనగరం: అద్దె చెల్లించని షాపులకు తాళాలు

66చూసినవారు
విజయనగరం: అద్దె చెల్లించని షాపులకు తాళాలు
విజయనగరం నగరపాలక సంస్థ షాపింగ్ కాంప్లెక్స్ లో అద్దె చెల్లించని షాపులపై మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. చాలా కాలంగా అద్దె చెల్లించని షాపులకు నోటీసులు జారీ చేసినప్పటికీ అద్దెలు చెల్లించకపోవడంతో గురువారం 15 దుకాణాలను రెవెన్యూ సిబ్బంది మూసివేసి తాళాలు వేశారు. అద్దె సకాలంలో చెల్లించని యెడల కఠిన చర్యలు తీసుకుంటామని కమీషనర్ నల్లమయ్య హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్