విజయనగరం: ఆపరేషన్ సింధూర్ లో భారత త్రివిధ దళాలు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన విజయానికి ప్రతీకగా కోట జంక్షన్ నుండి గంట స్థంభం జంక్షన్ వరకు శుక్రవారం కూటమి నేతల ఆధ్వర్యంలో "తిరంగా ర్యాలీ" నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతి రాజు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అధితి తదితరులు పాల్గొన్నారు.