విజయనగరం కార్పొరేషన్ పరిధిలో పలు రహదారులు పార్కుల అభివృద్ధిని విఎంఆర్డిఏ ద్వారా చేపట్టడానికి ప్రతిపాదనలు చేసినట్లు జిల్లా కలెక్టర్ అంబెడ్కర్ తెలిపారు. మంగళవారం ఆయన ఛాంబర్లో విఎంఆర్డిఏ కమిషనర్ కె.ఎస్ విశ్వనాథన్, జెసి సేతు మాధవన్ తో చర్చించారు. స్థానిక ఐస్ ఫ్యాక్టరీ జుంక్షన్ నుండి ధర్మపురి, ఐనాడా వరకు, జెఎన్టియు, మెడికల్ కాలేజ్ రోడ్లను అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించినట్లు కలెక్టర్ తెలిపారు.