పవన్ చిక్కడు.. దొరకడు: పేర్ని నాని

137చూసినవారు
పవన్ చిక్కడు.. దొరకడు: పేర్ని నాని
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలో శనివారం ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతిరోజు రాష్ట్రంలో ఆడపిల్లలు బలవుతున్నారు. వైసీపీ నేతలపై హత్యలు, హత్యాయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేది ఉందా? పవన్ కళ్యాణ్ చెబితేనే పోలీసులు పని చేస్తారా? పవన్ చెప్పేవన్నీ సినిమా డైలాగులే. సమస్య ఉంటే పవన్ చిక్కడు.. దొరకడు. ఏదైనా సమస్య జరిగితేనే చంద్రబాబు బయటకు వస్తాడు.’ అని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్