గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో TDP వ్యవహరించిన తీరుకు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదని మాజీ మంత్రి అంబటి రాంబాబు జోస్యం చెప్పారు. గుంటూరు కార్పొరేషన్‌లో అవిశ్వాసం పెడితే ఎదుర్కొంటామని తెలిపారు. ఇంత జరుగుతుంటే పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. చంద్రబాబు అక్రమాలపై మాట్లాడలేని పిరికివాడు పవన్ కళ్యాణ్ అని.. ఇప్పటికైనా పవన్ సైలెంట్ మోడ్ వీడాలని అంబటి విమర్శించారు.