కొణిదెల గ్రామానికి పవన్‌కల్యాణ్‌ రూ.50 లక్షల అందజేత

66చూసినవారు
కొణిదెల గ్రామానికి పవన్‌కల్యాణ్‌ రూ.50 లక్షల అందజేత
AP: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో తన ఇంటి పేరుతో ఉన్న కొణిదెల గ్రామాభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ రూ.50 లక్షలు అందజేశారు. కర్నూలు జిల్లా పూడిచెర్లలో ఇటీవల పంటకుంట నిర్మాణాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న పవన్‌కల్యాణ్‌ను నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య కలిసి కొణిదెల గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. పవన్ ఇచ్చిన హామీ మేరకు చెక్కును నంద్యాల కలెక్టర్‌ రాజకుమారి రెవెన్యూ అధికారులకు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్