జనసేన అధినేత పవన్ కల్యాణ్ సతీసమేతంగా మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్ ఓటు హక్కు మంగళగిరిలో ఉండటంతో ఇక్కడ ఓటు వేశారు. అనంతరం పోలింగ్ సిబ్బందితో మాట్లాడారు. ఓటర్లు బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.