AP: పల్లెల్లో సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. పల్లెల్లో పరిపాలన సులభతరం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు చేపట్టి కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని సూచించారు. కమిటీ సూచనల ఆధారంగా పల్లె పాలనలో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. గ్రామ పంచాయతీల్లో కొత్త క్లస్టర్ల విభజన, గ్రేడ్ల కేటాయింపుపైన కమిటీ ప్రభుత్వానికి సిఫారసులు చేయనుంది.