డిప్యూటీ CMగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా మారిపోయారని CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచల వ్యాఖ్యలు చేశారు. కాషాయ వస్త్రాలు ధరించడం, బొట్టు పెట్టుకోవడం వంటి మార్పులతో పవన్ ఇప్పుడు మారిపోయారని, BJP ఎజెండాను మోస్తున్నారని ఆరోపించారు. "పవన్, సనాతన ధర్మం పాటించే వ్యక్తిగా చాటుకోవడానికి తన క్రిస్టియన్ భార్యతో తిరుమలలో గుండు కొట్టించారు.. అంత అవసరమా?" అంటూ ఓ ఇంటర్వూలో ప్రశ్నించారు.