AP: ప్రపంచ చిత్తడి భూముల దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ప్రకృతిలో అత్యంత విలువైన పర్యావరణ వ్యవస్థలలో ఒత్తిడి భూములు ప్రధానమైనవి. సహజ నీటి శుద్ధి కేంద్రాలు, కార్బన్ నిల్వ కేంద్రాలు, వర్షపు నీటిని భూగర్భానికి చేరుస్తూ.. పర్యావరణ సమతుల్యతను కాపాడే ప్రదేశాలు. ఈ భూములు భూకంప ఉధృతిని తగ్గిస్తుందని, జీవ వైవిద్యాన్ని పరిరక్షించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.’ అని పోస్టు పెట్టారు.