ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో నెట్టింట ట్రెండ్ అవుతోంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని బాగుజోల గ్రామంలో ఆయన పర్యటించినప్పుడు తీసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో బురదకాళ్లతో, మట్టిపట్టిన ప్యాంటుతో పవన్ కనిపిస్తున్నారు. దీనిపై పవన్ అభిమానులు స్పందిస్తూ.. రాజకీయ నాయకులు, సినీనటులకు గిరిజనుల సమస్యలు తెలియవంటూ కొందరు చేసే కామెంట్లకు ఆయన తన చేతల తోటి సమాధానమిస్తున్నారని చెప్తున్నారు.