జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు తన అభిమానులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాని ఉపయోగించుకుని కుటుంబాలను, మహిళలను కించపరుస్తూ తప్పుడు పోస్టులు పెడితే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పవన్ సూచనలు మేరకు జనసేన శతాగ్ని టీం సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. సోషల్ మీడియాని బాధ్యతగా, సమాజానికి ఉపయోగకరంగా వినియోగించాలని ఆ పోస్ట్‌లో సూచించారు.