AP: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల పర్యటనకు పవన్ శ్రీకారం చుట్టారు. త్వరలోనే పవన్ జిల్లాల పర్యటన ఉంటుందని ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి తర్వాత పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటన ఉంటుందని గతంలో ప్రచారం సాగింది. అయితే జనసేనాని మార్చి మొదటి వారంలో జిల్లాల పర్యటనకు వెళ్లనున్నట్లు జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై త్వరలోనే జనసేన ప్రకటన ఇవ్వనున్నట్లు సమాచారం.