AP: వికసిత్ భారత్ వైపు నడిపించేలా కేంద్ర బడ్జెట్ ఉందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రానికి అమూల్యమైన ప్రోత్సాహం ఇస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ధన్యవదాలు తెలిపారు. రాజకీయ అవసరాలంకంటే దేశం, ప్రజలు ముఖ్యం అనే సమున్నత దృక్పథం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కనిపించిందన్నారు. రైతులు, మహిళలు, యువత, మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకున్నారని గుర్తు చేశారు.