ఆంధ్రప్రదేశ్‌లో 25,000కు పైగా చిత్తడి నేలలు ఉన్నాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. చిత్తడి నేలలు పరిరక్షించుకోవాలని చెప్పారు. ప్రకృతిలో అత్యంత విలువైన పర్యావరణ వ్యవస్థల్లో చిత్తడి నేలలు ప్రధానమైనవని అన్నారు. ఈరోజు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవమని గుర్తుచేశారు. ఈ సందర్భంగా పర్యావరణంలో చిత్తడి భూముల ప్రాధాన్యాన్ని అందరం గుర్తించాలని.. ఇవి సహజ నీటి శుద్ధి కేంద్రాలని అన్నారు.