జనసేన నేత కిరణ్ రాయల్ వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీకి సమస్యగా మారుతోంది. కిరణ్ రాయల్‌పై వస్తున్న ఆరోపణలతో వైసీపీ నేరుగా డిప్యూటీ సీఎం పవన్ ను టార్గెట్ చేస్తోంది. పవన్ వైఖరి ఏంటని ప్రనశ్నిస్తోంది. సోషల్ మీడియా వేదికగా కిరణ్ రాయల్ వీడియోలను సర్క్యులేట్ చేస్తోంది. ఈ వ్యవహారంలో కిరణ్ రాయల్ వివరణ ఇచ్చారు. ఇంకా వివాదం మాత్రం ఆగలేదు. దీంతో, ఇప్పుడు పవన్ ఈ వివాదంపైన ఏం చేయబోతున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూటమిలో హాట్ టాపిక్‌గా మారింది.