ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ నాయకులను అసెంబ్లీ వేదికగా హెచ్చరించారు. వైసీపీ నేతలను వదిలేదన్నారు. 'గత ప్రభుత్వం ఏం చేసిందంటే అన్నింటిలోనూ అవకతవకలు చేసింది' అని పవన్ చెప్పారు. ఉపాధి హామీ పథకంలో జగన్ సర్కార్ కోట్ల రూపాయలను దారి మళ్లించిందని పవన్ మండిపడ్డారు. ఈ నిధులు మళ్లించిన వారు ఎంత పెద్ద వారైనా వదిలి పెట్టేది లేదంటూ పవన్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి రూపాయిని వెలికి తీసే పనిని చేపట్టామన్నారు.