AP: రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశంలోనే ఎక్కువ మందికి పింఛన్లు ఇస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియోను పంచుకున్నారు. 'జనాభా లెక్కలో చూసుకుంటే 100మందిలో 13మందికి పింఛన్లు ఇస్తున్నాం. దీనికోసం నెలకు రూ.2,750 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఏడాదికి రూ.33 వేల కోట్లు కేవలం పింఛన్లకే ఖర్చు చేస్తున్నామంటే సంక్షేమం ఏ స్థాయిలో జరుగుతున్నదో అర్ధం చేసుకోవచ్చు' అని ఆయన తెలిపారు.