ఈ నెల తగ్గిపోయిన పింఛన్లు

70చూసినవారు
ఈ నెల తగ్గిపోయిన పింఛన్లు
AP: ప్రతి నెలా ఇచ్చే పింఛన్ల సంఖ్య ఈ నెల తగ్గింది. జనవరిలో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం విడుదల చేసిన పింఛన్ల సంఖ్య కంటే ఫిబ్రవరి 1న పంపిణీ చేసేందుకు ప్రభుత్వం విడుదల చేసిన పింఛన్ల సంఖ్యలో 18,036 తగ్గింది. గత 8 నెలల్లో ఏకంగా 1,89,957 పింఛన్లు తగ్గిపోయాయి. జనవరిలో 63,77,943 మందికి, ఫిబ్రవరిలో 63,59,907 మంది పింఛన్ లబ్ధిదారులకు నిధులు విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్