
ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కిడ్నాప్!
AP: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉత్కంఠంగా మారింది. ఆ పీఠాన్ని దక్కించుకునేందుకు కూటమి, వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంను టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారని వైసీపీ ఆరోపిస్తుంది. అర్ధరాత్రి ఆయనను నివాసం నుంచి తీసుకెళ్లినట్లు వైసీపీ చెబుతోంది. టీడీపీ నేత రవినాయుడు దుర్మార్గంగా వ్యవహరించారని, అధికార దుర్వినియోగంతో గద్దెక్కాలని దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు వైసీపీ పేర్కొంది.