రాష్ట్రపతి ప్రసంగంపై మంగళవారం లోక్‌సభలో ధన్యవాద తీర్మానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నాలుగోసారి ప్రజలు తనని ఆశీర్వదించారని అన్నారు. గడిచిన 10 ఏళ్లలో 24 కోట్ల మంది పేదరికాన్ని జయించారని, ఐదేళ్లలో 12 కోట్ల మందికి మంచినీటి వసతి కల్పించామని పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో 25 శాతం గడిచిపోయిందని, వికసిత భారత్ తమ లక్ష్యమని వెల్లడించారు. కొంతమంది నేతలు పేదలతో ఫొటో సెషన్స్ చేస్తున్నారని, పార్లమెంట్ చర్చల్లో మాత్రం పాల్గొనరంటూ ఆరోపించారు.