AP: ఐదేళ్ల వైసీపీ పాలనలో తన లాంటి వాళ్లకు కూడా రక్షణ లేకుండా పోయిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ ఆయన గుంటూరు జిల్లా పొన్నెకల్లు సభలో మాట్లాడుతూ.. రాజధాని అమరావతిని ప్రతిపక్ష నాయకులు ఎడారి, శ్మశానం అంటూ వర్ణించారని అన్నారు. రాజధానిని ధ్వంసం చేసి పైశాచిక ఆనంతం పొందారని ఫైర్ అయ్యారు. 2019-2024 మధ్య తన లాంటి వాళ్లు కూడా బయటకు రాని పరిస్థితి వచ్చిందని తెలిపారు. డా. బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల నేడు అందరం స్వేచ్ఛగా ఉన్నామన్నారు.