కేజ్రీవాల్ నాయకత్వంలోనే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగిందని ప్రజలు నమ్మారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకే కేజ్రీవాల్, సిసోడియా లాంటి నేతలను ఢిల్లీ ప్రజలు ఓడించారన్నారు. "లిక్కర్ స్కామ్‌పై ఢిల్లీ ప్రజలు తీర్పు ఇచ్చారు.. ఇక కోర్టు తీర్పు రావాల్సి ఉంది. ఎన్ని ఉచితాలు ఇస్తామన్నా కేజ్రీవాల్‌ను ప్రజలు నమ్మలేదు. కేజ్రీవాల్ డ్రామాలను ప్రజలు తిప్పికొట్టారు." అని కిషన్ రెడ్డి అన్నారు.