తిరుపతి గరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి ఎన్నికవడంపై మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. తిరుపతి నగర పాలక సంస్థ ఉప మేయర్ ఎన్నికల్లో YCP అభ్యర్థి ఓటమి ప్రజాస్వామ్య ఓటమి అని అన్నారు. విధుల నిర్వహణలో మేయర్ శిరీషను అవమానించారని రోజా మండిపడ్డారు. వ్యవస్థల ఉదాసీనత, అధికార దుర్వినియోగం గెలిచిందిని అన్నారు. సమయం వచ్చినప్పుడు ప్రజలు ఇందుకు సమాధానం చెబుతారని ఆమె పేర్కొన్నారు.