ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో మాట్లాడుతూ.. గత పదేళ్లలో 25 కోట్లమందిని పేదరికం నుంచి బయటపడేశామని తెలిపారు. ఇథనాల్ బ్లెండింగ్తో పెట్రోల్, డిజీల్ ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం తమలో ఆత్మవిశ్వాసం నింపిందన్నారు. “వికసిత్ భారత్ సాధనే మా ప్రభుత్వ లక్ష్యం. మధ్యతరగతి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాలు గరీబీ హఠావో అని నినాదాలు మాత్రమే చేశాయని" మోదీ అన్నారు.