AP: పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ ఎక్స్‌లో షేర్ చేసిన ఓ పోస్టు వివాదానికి దారి తీసింది. ‘కష్టపడి సాధించిన విజయానికే నిజమైన గౌరవం.’ అంటూ షేర్ చేసిన వీడియోలో ఆయన పవన్ కళ్యాణ్ గెలుపు కోసం చేసిన ప్రచార దృశ్యాలు ఉన్నాయి. అయితే ఆ వీడియోలో ఎక్కడా పవన్ ఫోటో లేదు. తర్వాత ఆ పోస్టును వర్మ డిలీట్ చేశారు. తన అకౌంట్‌ను ఓ సంస్థ మెయింటేన్ చేస్తోందని వర్మ చెప్పారు. అయితే వర్మ కూటమిలో చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్నారని జనసైనికులు మండిపడుతున్నారు.