సీఎం చంద్రబాబుతో ముగిసిన పీయూష్ ఘోయల్ భేటీ

71చూసినవారు
సీఎం చంద్రబాబుతో ముగిసిన పీయూష్ ఘోయల్ భేటీ
AP: ఉండవల్లిలోని నివాసంలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. రాష్ట్రంలోని వివిధ అంశాలపై సీఎం, కేంద్రమంత్రి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్‌పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్‌పై జీఎస్టీ తగ్గింపుపై ఇరువురు నేతలు చర్చించారు. పొగాకు ధరలు తగ్గినందున రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నట్టు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్