AP: కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో ఉండవల్లిలోని నివాసంలో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. వీరు ఈ భేటీలో ముఖ్యంగా హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్‌పై జీఎస్టీ తగ్గింపు గురించి చర్చించారు. పొగాకు కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.300 కోట్లు ఖర్చు చేస్తోందని, టొబాకో బోర్డు రూ.150 కోట్లు భరించేలా చూడాలన్నారు.