శ్రీవారి ఆలయం మీదుగా మరోసారి విమానం

74చూసినవారు
శ్రీవారి ఆలయం మీదుగా మరోసారి విమానం
AP: తిరుమలలో మరోసారి ఆగమశాస్త్రం ఉల్లంఘన జరిగింది. శ్రీవారి ఆలయం మీదుగా మరోసారి విమానం వెళ్లడం భక్తులను ఆవేదనకు గురి చేసింది. ఆగమశాస్త్రం నిబంధనల మేరకు ఆలయ గోపురంపై ఎలాంటి సంచారం జరగకూడదని పండితులు చెబుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని కేంద్రానికి టీటీడీ కోరినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు.

సంబంధిత పోస్ట్