షెడ్యూల్‌ ప్రకారం పోలవరం పనులు: మంత్రి నిమ్మల

78చూసినవారు
షెడ్యూల్‌ ప్రకారం పోలవరం పనులు: మంత్రి నిమ్మల
AP: పోలవరం ప్రాజెక్టు పనులు షెడ్యూల్‌ ప్రకారం జరుగుతున్నాయని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అధికారులతో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి మంగళవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం చంద్రబాబు ఇప్పటికే క్షేత్రస్థాయిలో మూడు సార్లు పరిశీలించారన్నారు. 80శాతం పనులు పూర్తయ్యాయని, 2027 చివరి నాటికి పూర్తిచేసేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్