AP: వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌పై అనంతపురం పోలీసులు సీరియస్ అయ్యారు. ఫోర్జరీ మెడికల్ సర్టిఫికెట్ విషయాన్ని దాచి వీడియోలో మొసలి కన్నీరు కార్చిన అనిల్ 111 సెక్షన్ వర్తించదంటూ వీడియో రిలీజ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉంటూ వీడియో రిలీజ్ చేసినట్లు అనంతపురం పోలీసులు గుర్తించారు. కాగా, ఇప్పటికే అనిల్ బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు.