ఇంగ్లాండ్‌తో భారత్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. మొదటి వన్డే కోసం జట్టు నాగ్‌పూర్ చేరుకున్నప్పుడు ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది తమ బస్సు దిగినప్పుడు త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘును పోలీసులు గుర్తించలేదు. ఆయనను కేవలం అభిమానిగా భావించి హోటల్ లోపలికి అనుమతించలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.