TG: ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఓ వివాహితను పోలీసులు కాపాడారు. ఈ ఘటన రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ మేరకు ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడుతోందని డయల్ 100కు సమాచారం వచ్చింది. దీంతో తక్షణమే స్పందించి.. కానిస్టేబుళ్లు రాజు, తరుణ్ లు ఘటనాస్థలికి చేరుకున్నారు. మహిళ గదిలో ఉరి వేసుకునేందుకు ప్రయత్నించగా.. తలుపులు బద్దలుకొట్టి ఆమెను రక్షించారు. దీంతో ఆ పోలీసులను పలువురు అభినందిస్తున్నారు.