టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్య కేసును ఛేదించిన పోలీసులు

63చూసినవారు
టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్య కేసును ఛేదించిన పోలీసులు
AP: ఒంగోలులో దారుణ హత్యకు గురైన వీరయ్య చౌదరి కేసును ప్రకాశం జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి 9మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్య కేసులో 11 మంది నిందితులను గుర్తించామని జిల్లా ఎస్పీ దామోదర్ వెల్లడించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. మృతుడు వీరయ్య స్వగ్రామం అమ్మనబ్రోలుకి చెందిన ఆళ్ళ సాంబయ్య ఈ హత్య కేసులో ప్రధాన కుట్రదారుడిగా తమ దర్యాప్తులో గుర్తించామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్