ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ పోలీస్ అధికారి పట్టపగలు మద్యం తాగి నడిరోడ్డుపై పడుకున్నాడు. స్థానికులు ఆయనను లేపినా కూడా ఫలితం లేదు. ఈ ఘటనను బాటసారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. సదరు పోలీస్ అధికారిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.