ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, ఆప్ మధ్య పోస్టర్ల వార్ నడుస్తోంది. ఇటీవల బీజేపీ తొలి జాబితాను రిలీజ్ చేయగా..గుర్రంపై వరుడు లేని వీడియోను ఆప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బీజేపీ ఇంకా సీఎం అభ్యర్థిని ప్రకటించలేదని కౌంటర్ వేసింది. దీంతో కమలం పార్టీ స్పందిస్తూ దేశ రాజధానిలో త్వరలో బీజేపీ అధికారంలోకి వస్తుందని.. దీంతో ఢిల్లీ ప్రజలకు వచ్చిన ఆపద తొలగిపోతుందని సూచిస్తూ ఓ పోస్టర్‌ను పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.