ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని పొల్లూరు జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. సుమారు 50 అడుగుల పైనుంచి నీటి ప్రవాహం ఎగిసిపడుతోంది. ఈ సుందర జలపాతాన్ని తిలకించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో ఇక్కడికి తరలివస్తున్నారు. ఇక్కడి ప్రకృతి సోయాగాలను చూసి మైమరచిపోతున్నారు.