రేపటి నుంచి పాలిసెట్ తుది విడత కౌన్సిలింగ్

61చూసినవారు
రేపటి నుంచి పాలిసెట్ తుది విడత కౌన్సిలింగ్
ఏపీ పాలిసెట్ అభ్యర్థులకు బిగ్ అప్డేట్. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు తుది విడత కౌన్సిలింగ్ ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు బి.నవ్య తెలిపారు. పాలిసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ప్రవేశాల కోసం వెబ్ ఆధారిత కౌన్సిలింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువ పత్రాల పరిశీలన ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 16న సీట్లు కేటాయింపు జరుగుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్