గత 5 ఏళ్లుగా రోడ్లు మొత్తం గుంతల మయం చేసారని సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ‘‘రేపటి నుంచి గుంతలు పూడ్చే కార్యక్రమానికి విజయనగరం జిల్లా గజపతినగరం నుంచి శ్రీకారం చుట్టాం. కేవలం గుంతలు పూడ్చటానికి రూ.826 కోట్లు అవుతుంది. అంతా విధ్వంసం చేసి వెళ్లారు’’ అని సీఎం అన్నారు. ఎక్కడ చూసినా రోడ్లు చెత్త చెత్తగా చేశారు. ప్రయాణానికి అనుకూలంగా లేవన్నారు.