పేదరికం వల్ల చదువుకోలేని పరిస్థితి రాకూడదు: సీఎం చంద్రబాబు

68చూసినవారు
పేదరికం వల్ల చదువుకోలేని పరిస్థితి రాకూడదు: సీఎం చంద్రబాబు
AP: పేదరికం వల్ల చదువుకోలేని పరిస్థితి రాకూడదని సీఎం చంద్రబాబు అన్నారు. ఆదుకునేందుకు అండగా ఎవరూ లేక ఎంతో మంది యువత కూలీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. "సమాజాన్ని ఆసరా చేసుకొని బాగుపడినవారు ఆలోచించాలి. పేదవాళ్లను పైకి తీసుకొచ్చేందుకు తమ పరిధిలో చేయూత ఇవ్వాలి. కింద స్థాయిలో ఉన్న 20% మందికి అండగా ఉందాం. అవసరమైతే కాస్త డబ్బు ఖర్చు చేద్దాం. ఆర్థిక అసమానతలు తగ్గించడమే మా ప్రభుత్వ లక్ష్యం’’ అని సీఎం పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్