కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో గురువారం వేకువ జాము నుంచే పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. గ్రామపంచాయతీ సెక్రటరీ లక్ష్మీకాంత్ స్వయంగా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. నూరు శాతం పెన్షన్లు పంపిణీ పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నట్లు లక్ష్మి కాంత్ తెలియచేశారు. లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నేరుగా ఇంటి వద్దకే వెళ్లి అందజేస్తున్నట్లు చెప్పారు.