సంతమాగులూరు మండలం సంతమాగులూరు పోలీస్ స్టేషన్ సిఐగా శుక్రవారం వెంకట్రావు స్టేషన్ నందు నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు పని చేసిన నరసింహారావు బదిలీపై వెళ్లిన నేపథ్యంలో ఆయన స్థానంలో వెంకట్రావు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం సీఐ వెంకట్రావు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.