పేదల నోటికాడ కూడు తీసిన నీచ చరిత్ర వైసిపిదైతే, వారి ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్ లను పునరుద్ధరించిన ఘనత చంద్రబాబు నాయకత్వంలోని ప్రజా కూటమి ప్రభుత్వానిదని చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పేర్కొన్నారు. బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ తో కలిసి ఆయన శుక్రవారం చీరాలలో అన్నా క్యాంటీన్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్యాంటీన్ నిర్వహణకు అవసరమైతే తన సొంత నిధులను వెచ్చిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.