తాళ్లూరు మండలంలో పాల డైరీలపై ఎస్ఐ మల్లికార్జున తనిఖీలు నిర్వహించారు. ఎస్సై శనివారం పాల ఉత్పత్తి మిషనరీ పరిశీలించారు. ఈ సందర్భగా మాట్లాడుతూ నాణ్యత కలిగిన పాలని సరఫరా చేయాలని, కల్తీ పాలు అమ్మకానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని తెలిపారు. ఈ పాల తనిఖీలో ఎస్సై మల్లికార్జునతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.