ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పోలీస్ స్టేషన్ లో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఎస్ఐ నరసింహారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందితో కలిసి ఎస్సై నరసింహారావు జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలమే మనకు ఈ స్వాతంత్రం లభించని ఎస్ఐ నరసింహారావు ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.