ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొండపేట లో మంగళవారం రక్తపింజరి పాము కలకలం రేపింది. గ్రామానికి చెందిన లక్ష్మణ్ ఇంటిలో రక్తపింజరిపాము కనిపించింది. తీవ్ర ఆందోళన చెందిన గ్రామస్తులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పామును బంధించి అటవీ శాఖ అధికారులు అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. బంధించిన రక్త పింజరిపాము చాలా విషపూరితమైనదని కాటు వేస్తే మనిషి బతికే అవకాశం లేదని అటవీ శాఖ అధికారులు తెలిపారు.